VS11 | విశ్వక్ సేన్ మాస్ ట్రీట్.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్
Gangs Of Godavari Movie | ఆ మధ్య గంగానమ్మ దేవత దగ్గర అగ్గి కాగడను పట్టుకుని ఉన్న విశ్వక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి వీర లెవల్లో హైప్ తీసుకొచ్చింది చిత్రబృందం.
Gangs Of Godavari Movie | ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్తో కూస్తో దూకుడు చూపిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది విశ్వక్ సేనే. ఓ వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా విశ్వక్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఈ మధ్యే ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ విడుదలైంది. తొలిరోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో వారం వరకు బాగానే లాక్కొచ్చింది. ఇటీవల ఓటీటీలో రిలీజై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం విశ్వక్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో సితార బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి.
ఆ మధ్య గంగానమ్మ దేవత దగ్గర అగ్గి కాగడను పట్టుకుని ఉన్న విశ్వక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి వీర లెవల్లో హైప్ తీసుకొచ్చింది చిత్రబృందం. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గ్లింప్స్‌తో సినిమాపై మేకర్స్ కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గోదావరి ప్రాంతంలోని రౌడీ గ్యాంగ్స్ చుట్టూ తిరిగే పీరియడ్ మూవీ ఇదని గ్లింప్స్‌తో స్పష్టమయింది. సినిమా మొత్తం గోదావరి ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. మేము గోదారోళ్ళం.. మాట ఒక్కటే సాగదీస్తాం. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటూ విశ్వక్ చెప్పై డైలాగ్ అదిరిపోయింది.
గ్లింప్స్ రా, రస్టిక్‌గా ఉంది. ఫలక్‌నుమా దాస్ తర్వాత విశ్వక్ ఆ రేంజ్ మాస్ క్యారెక్టర్‌తో రాబోతున్నట్లు గ్లింప్స్‌తో స్పష్టమైంది. గ్లింప్స్‌లో ముఖ్యంగా యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలీ కీలకపాత్ర పోషిస్తుంది. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సితారా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

