Vishwak Sen | విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు.. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు ఇబ్బంది పెడతారంటూ పోస్ట్..!
Vishwak Sen | ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్త దూకుడుగా కనిపించేది విశ్వక్ సేనే. అది సినిమాల్లోనైనా మరే ఇతర విషయాల్లోనైనా. సినిమాల విషయంలో ఎంత ప్యాషనేట్‌గా ఉంటాడో.. తన సినిమాల జోలికి వస్తే అంతే శివాలెత్తిపోతాడు. తాజాగా విశ్వక్ పెట్టిన పోస్ట్ దుమారం రేపుతుంది.
Vishwak Sen | ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్త దూకుడుగా కనిపించేది విశ్వక్ సేనే. అది సినిమాల్లోనైనా మరే ఇతర విషయాల్లోనైనా. సినిమాల విషయంలో ఎంత ప్యాషనేట్‌గా ఉంటాడో.. తన సినిమాల జోలికి వస్తే అంతే శివాలెత్తిపోతాడు. తాజాగా విశ్వక్ పెట్టిన పోస్ట్ దుమారం రేపుతుంది. తన కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్‌ను ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిట్ల వర్షం కురిపించాడు.
బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా.. డిసెంబర్ 8న వస్తున్నాం. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ చేస్తారన్నది మీ ఇష్టం. మీ నిర్ణయం. ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే నిర్ణయం కాదు. తగ్గే కొద్దీ మింగుతారు అని అర్థమైంది. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది.గంగమ్మ తల్లి కి నా ఒట్టు. మహా కాళి మాతో ఉంది. డిసెంబర్లో సినిమా రాకపోతే.. నేను ప్రమోషన్స్‌లో కనిపించను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే విశ్వక్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. ఇక ముందుగా ఈ సినిమా రిలీజ్‌ను డిసెంబర్ 8కి అనుకున్నారు. అయితే పోటీగా హాయ్ నాన్న, ఎక్స్ట్రార్డినరీ సినిమాలు కూడా ఒకరోజు అటు ఇటు రావడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్‌ను మార్చాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. మరి దాన్ని ఉద్దేశించి విశ్వక్ అలా మాట్లాడాడా లేదంటే మరో రీజన్ అయి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
ఛల్ మోహన్ రంగా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమాలో విశ్వక్ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలీ కీలకపాత్ర పోషిస్తుంది. సితారా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

