ఎప్పటికపుడు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వారికి నచ్చేటట్లు సినిమా చేసే యంగ్ హీరో ఎవరైనా ఉన్నారా..? అంటే వెంటనే గుర్తొచ్చే పేరు విశ్వక్ సేన్ (Vishwak Sen). తనకు నచ్చినట్టు సినిమా చేయడంలో.. ఆ సినిమాను పక్కాగా ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు విశ్వక్ సేన్. ఈ టాలెంటెడ్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్‌తో చేస్తున్న సినిమా విషయంలో వివాదం రావడంతో రీసెంట్గా మరోసారి వార్తల్లో నిలిచాడు.
విబేధాల కారణంగా విశ్వక్సేన్-అర్జున్ సినిమా రద్దయింది. అయితే ఈ వ్యవహారంలో విశ్వక్ సేన్ ను ట్రోల్స్ కూడా చుట్టుముట్టాయి. అయితే ట్రోల్స్ మాత్రం మాస్ కా దాస్‌పై ఏ మాత్రం ప్రభావం చూపించలేదని తాజా అప్డేట్ చెబుతోంది. కొత్త టాక్ ఏంటంటే.. అర్జున్ సినిమా రద్దు చేసుకున్న విశ్వక్ సేన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. తాను నటిస్తోన్న మరో సినిమా ధమ్కీపై ఫోకస్ పెట్టడం. ధమ్ కీ (Dhamki)టీజర్ పనులను మొదలుపెట్టాడట విశ్వక్ సేన్.
ధమ్ కీ సినిమా నుంచి డైరెక్టర్ తప్పుకోవడంతో విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. కాగా ధమ్ కీ టీజర్ రెడీ అయిందని, అందరినీ ఇంప్రెస్ చేసేలా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి ఆఫ్ స్క్రీన్‌లో ఎన్ని చిక్కులు వచ్చినా.. సినిమా విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదేలే అంటూ తన పని తాను చేసుకుపోతుండటం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Read Also : Sunil | శివకార్తికేయన్ మావీరన్లో సునీల్.. వీడియో
Read Also :Mythri Movies Makers | క్రేజీ టాక్.. డిస్ట్రిబ్యూషన్లోకి మైత్రీ మూవీ మేకర్స్..!
Read Also : Rashmika Mandanna | ప్రతీ ఒక్కరికీ నచ్చాలని ఏమీ లేదు.. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌పై రష్మిక మందన్నా
Read Also : Adivi Sesh | యూట్యూబ్ నుంచి హిట్ 2 టీజర్ డిలీట్ చేశారా..? అడివి శేష్ క్లారిటీ వీడియో