Hari and Harish | ఆ ఒక్క సీన్ కోసం సమంత రెండు నిమిషాలు టైం అడిగారు.. యశోద డైరెక్టర్స్ హరి-హరీష్ చిట్‌చాట్
హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న యశోద (Yashoda) చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా హరి-హరీష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. యశోద సినిమా విశేషాలు ఈ డైరెక్టర్ల మాటల్లోనే..
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీం. ప్రమోషన్స్ లో భాగంగా హరి-హరీష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. యశోద సినిమా విశేషాలు ఈ డైరెక్టర్ల మాటల్లోనే..
అంబులి, ఒరు ఇరవు తమిళ సినిమాల తర్వాత తీస్తున్న భారీ సినిమా యశోద గురించి..?
స్థాయి పరంగా చూస్తే చాలా డిఫరెంట్ సినిమా ఇది. కానీ ఛాలెంజ్ మాత్రం ఒకటే. మా తొలి సినిమా ఒరు ఇరవులో హీరో కానీ, హీరోయిన్ కానీ ఉండరు. ప్రేక్షకులే హీరో. హరీష్ తండ్రి ఆ సినిమాకు నిర్మాత. యశోద విషయానికొస్తే కంటెంట్ పరంగా సవాళ్లు ఉండటమే కాదు.. భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. కథ చాలా ముఖ్యం కాబట్టి..కథానుగుణంగా యశోదకు చాలా బడ్జెట్ అవసరమైంది.
సినిమాను లో బడ్జెట్లో తీయాలని ఒక వెర్షన్‌ను సిద్దం చేశాం. మేము స్కిప్ట్ రాసేటపుడు సమంత మా మైండ్‌లో ఉంది. ఈ కథను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌కు వినిపించినపుడు.. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ఎందుకు తీయకూడదని ఆయన మమ్మల్ని ప్రశ్నించారు. కంటెంట్ బాగుండటంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాలని అనుకున్నారు. కంటెంట్ పరంగా చూస్తే ఈ సినిమా చాలా కొత్తది. ఈ చిత్రం పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.
ఏదైనా అంతర్జాతీయ సినిమాను స్పూర్తిగా తీసుకున్నారా..?
మేము ఎలాంటి రెఫరెన్స్ లు ఏమీ తీసుకోలేదు. కేవలం వార్తల నుంచి రెఫరెన్స్ తీసుకున్నాం. ప్రపంచం చుట్టూ ఏం జరుగుతుందో మాకు తెలియదు. స్క్రిప్ట్‌ను డెవలప్ చేసిన తర్వాత సస్పెన్స్ ఎలిమెంట్స్ ను యాడ్ చేశాం. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగబోతుంది అన్న ఎక్జయిట్మెంట్ ప్రేక్షకుల్లో తప్పక ఉంటుంది.
సమంతతో పనిచేయడం ఎలా అనిపించింది..?
సినిమాలో ఓ భారీ ఎమోషనల్ సీన్ ఉంటుంది. కెమెరా ముందు గ్లిసరిన్ వాడకుండా కన్నీళ్లు తెప్పించేలా నటించేందుకు సమంత రెండు నిమిషాలు అడిగారు. ప్రతీ 20 నిమిషాలకు కీలక మలుపు కనిపిస్తుంది. సర్ప్రైజ్లు, షాక్‌లతో సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. మేం చేసిన ఇతర సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమాలో చాలా రకాల భావోద్వేగ సన్నివేశాలుంటాయి. షాట్‌ని సరిగ్గా తీసేందుకు ఇంకా టేక్‌లు ఏమైనా అవసరమా అని సమంత మమ్మల్ని అడిగేదంటూ చెప్పుకొచ్చారు.
తమిళంకు బదులు తెలుగు సినిమా ఎందుకు చేస్తున్నారు..?
మా స్నేహితుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సెంథిల్ గారు దీనికారణం. తొలి వెర్షన్ రెడీ అవుతున్నపుడు సినిమాను తీయాలని అనుకున్నారు..అభిప్రాయం కోసం ఈ కథను శివలెంక కృష్ణప్రసాద్‌గారికి వివరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియల సమయంలో మేము కలిశాం. అంతా ఒకే అంటే ప్రసాద్‌గారు యశోదను భారీ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నట్టు చెప్పారు.
సమంత యశోద ట్రైలర్ ..
యశోద యాక్షన్ పార్ట్ మేకింగ్ వీడియో..
Read Also : Sunil | శివకార్తికేయన్ మావీరన్లో సునీల్.. వీడియో
Read Also : Rashmika Mandanna | ప్రతీ ఒక్కరికీ నచ్చాలని ఏమీ లేదు.. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌పై రష్మిక మందన్నా
Read Also : Adivi Sesh | యూట్యూబ్ నుంచి హిట్ 2 టీజర్ డిలీట్ చేశారా..? అడివి శేష్ క్లారిటీ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

