కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా చిత్రం మావీరన్ (Maaveeran). తెలుగులో మహావీరుడు టైటిల్‌తో తెరకెక్కుతోంది. మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ మేకర్స్ ఒక వీడియోను విడుదల చేశారు. టీంలోకి సునీల్గారికి స్వాగతం అంటూ మేకర్స్ స్పెషల్ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి భరత్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్.
గతేడాది పాన్ ఇండియా సినిమా పుష్పలో మంగళం శ్రీను గెటప్‌లో అదిరిపోయే లుక్‌తో అదరగొట్టేశాడు సునీల్. ఈ టాలెంటెడ్ యాక్టర్ మా వీరన్‌లో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ ఏడాది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శివకార్తికేయన్. జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
సునీల్‌కు వెల్ కమ్ చెబుతూ..వీడియో
We are glad to have @Mee_Sunil onboard! 💐 #Maaveeran@Siva_Kartikeyan @AditiShankarofl @DirectorMysskin @madonneashwin @iamarunviswa @vidhu_ayyanna @bharathsankar12 @philoedit @LokeshJey @DoneChannel1 pic.twitter.com/ey2wfo2fzU
— Shanthi Talkies (@ShanthiTalkies) November 8, 2022
Read Also : Masooda | హారర్ డ్రామా మసూద విడుదల తేదీ ఫైనల్
Read Also : Rashmika Mandanna | ప్రతీ ఒక్కరికీ నచ్చాలని ఏమీ లేదు.. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌పై రష్మిక మందన్నా
Read Also : Adivi Sesh | యూట్యూబ్ నుంచి హిట్ 2 టీజర్ డిలీట్ చేశారా..? అడివి శేష్ క్లారిటీ వీడియో