Betting Apps Promotion | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. నిమిషానికి ఎంత తీసుకున్నారంటే?
ఒక నిమిషం వీడియోకు రూ.90వేలు చార్జ్ చేశామని, ఇలా సుమారు15 వీడియోలు ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది.
Betting Apps Promotion | ఖైరతాబాద్, మార్చ్20(నమస్తే తెలంగాణ): ఒక నిమిషం వీడియోకు రూ.90వేలు చార్జ్ చేశామని, ఇలా సుమారు15 వీడియోలు ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విష్ణుప్రియ, రీతూచౌదరిలు గురువారం పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ ఇద్దరిని రాత్రి తొమ్మిదిగంటల వరకు పోలీసులు విచారించారు. విష్ణుప్రియను సుమారు పదిగంటలపాటు, రీతూ చౌదరిని ఆరుగంటలపాటు పంజాగుట్ట డిఐ శ్రవణ్ ఆధ్వర్యంలో విచారించారు.
ఇద్దరి బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా వచ్చిన నిధులపై ఆరా తీశారు. ఈ క్రమంలో వారెన్నెన్ని వీడియోలు చేశారు, ఒక్కో వీడియోకు ఎన్ని డబ్బులు తీసుకున్నారు.. అని అడిగారు. ప్రమోషన్ చేయడానికి వారిని ప్రోత్సహించిందెవరంటూ పోలీసులు ప్రశ్నించారు. గురువారం విచారణ పూర్తి అయిన తర్వాత ఈ ఇద్దరిని ఈనెల 25న మళ్లీ విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు టేస్టీతేజా, కానిస్టేబుల్ కిరణ్‌లను పోలీసులు విచారించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

