Anushka Sharma | ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు తన రొమాంటిక్ స్టైల్‌తోనూ కింగ్ కోహ్లీ మరోసారి అందరి మనసులను దోచుకున్నాడు. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు, కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీ చాలా సులువుగా ఊదేసింది. కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగి కేవలం 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ కూడా 61 పరుగులతో అద్భుతంగా రాణించాడు.
మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం ఖరారు కాగానే స్టేడియంలో అందరినీ ఆకట్టుకునేలా ఒక క్యూట్ ‘విరుష్క’ మూమెంట్ చోటుచేసుకుంది. గెలుపు ఆనందంలో విరాట్ కోహ్లీ తన హెల్మెట్ తీసి, స్టాండ్స్‌లో తన కోసం ఉత్సాహంగా చీర్ చేస్తున్న భార్య అనుష్క శర్మ వైపు చూస్తూ ముద్దుగా ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చాడు. దానికి స్పందనగా అనుష్క కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే ప్రేమగా కోహ్లీకి రిటర్న్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆర్సీబీ మహిళల జట్టు క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ నవ్వుతూ ఆశ్చర్యంగా చూశారు. ఈ అందమైన క్షణంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది.
THE WAY VIRAT KOHLI GIVING FLYING KISS TO ANUSHKA SHARMA AFTER WON THE MATCH. ♥️😍
– Video of the Day!
— Tanuj (@ImTanujSingh) March 28, 2026