ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో మంచి హిట్టు కొట్టాడు..అయితే ఇటీవలే వచ్చిన సెబాస్టియన్ పీసీ 524 సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ యంగ్ హీరో అయినా ఏ మాత్రం నిరాశ పడకుండా ఎలాగైనా సక్సెస్ అందుకోవాలన్న కసితో కొత్త సినిమాను లాంఛ్ చేశాడు. గీతాఆర్ట్స్ 2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్ కిరణ్ అబ్బవరంతో జనవరిలో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
వినరో భాగ్యం విష్ణు కథ (Vinaro Bhagyamu Vishnu Katha) టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని నందకిశోర్ అబ్బురు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇవాళ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో మొదలైంది. హీరోతోపాటు ఇతర నటీనటులపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్లో చిత్రీకరించారు. నర్తనశాల ఫేం కశ్మీర పరదేశి ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
#VinaroBhagyamuVishnuKatha SHOOT BEGINS from today in Tirupati! #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @ItsChavan @GA2Official pic.twitter.com/6C6VrP16IB
— BA Raju's Team (@baraju_SuperHit) March 14, 2022
ఆర్ఎక్స్ 100కు బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అందించిన చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రాఫర్ కాగా..మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్.