Campiones remake | మరో విదేశీ ఫిల్మ్ రీమేక్ సన్నాహాల్లో అమీర్ ఖాన్..!
సినిమా ద్వారా ఏదైనా వీలైనంత మంచిని చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాడు అమీర్ ఖాన్ (aamir khan). అందుకే 30 ఏళ్ల కెరీర్ లో మిగతా హీరోలతో చూసినప్పుడు అమీర్ ఖాన్ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంటుంది.
కమర్షియల్ సినిమాలే కాకుండా సామాజిక చిత్రాలు చేస్తాడనే పేరున్న బాలీవుడ్ (Bollywood) స్టార్ అమీర్ ఖాన్ (aamir khan). సినిమా ద్వారా ఏదైనా వీలైనంత మంచిని చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాడీ అగ్ర హీరో. అందుకే 30 ఏళ్ల కెరీర్ లో మిగతా హీరోలతో చూసినప్పుడు అమీర్ ఖాన్ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంటుంది. మంచి కథలు ఎక్కడున్నా వెతికిపట్టుకునే ఈ హీరో..తాజాగా లాల్ సింగ్ చద్దా (laal singh chaddha) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్. కరీనా కపూర్, నాగ చైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాండమిక్ వల్ల షూటింగ్ ఆలస్యమై, విడుదల లేటవుతున్న ఈ సినిమా ఆగస్టులో విడుదలకు ముహూర్తం నిర్ణయించుకుంది.
ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో విదేశీ రీమేక్ కు సన్నాహాలు చేస్తున్నారు అమీర్ ఖాన్. స్పానిష్ ఫిల్మ్ కాంపియన్స్ (Campiones)ను పునర్నిర్మించే పనిలో పడ్డారు. మానసికంగా లోపాలున్న బాస్కెట్ బాల్ క్రీడాకారుల జట్టుకు కోచింగ్ ఇచ్చి పలు అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించేలా చేసిన కోచ్ జీవిత కథే ఈ సినిమా. ఆ కోచ్ పాత్రలో స్పానిష్ లో జేవియర్ గూటరెజ్ నటించగా..రీమేక్ లో అమీర్ ఖాన్ కనిపించబోతున్నారు.
మద్యానికి బానిసై, తన క్రీడాకారులపై ఆగ్రహాన్ని ప్రదర్శించే ఒక ముక్కోపి అయిన కోచ్ పాత్ర ఇది. అపారమైన ప్రతిభ ఉన్నా వ్యసనాలకు లోనైన ఈ కోచ్ మానసిక వికలాంగులున్న తన జట్టుతో ఎలా విజయాలు సాధించేలా చేశాడనేది తెరపై ఆసక్తికరంగా చూపించారు. జేవియర్ ఫాసర్ దర్శకత్వం వహించిన కాంపియన్స్ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ తరపును ఆస్కార్ కు విదేశీ విభాగంలో ఎంట్రీ అయ్యింది.
శుభ మంగళ్ సావధాన్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న కాంపియన్స్ రీమేక్ ను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని చేస్తున్న విషయంపై అమీర్ ఖాన్ స్పందిస్తు..సన్నాహాలు సాగుతున్నాయి, అధికారికంగా ప్రకటిస్తాం. అని అన్నారు. ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

