హాలీవుడ్ సినిమా అనుభూతినిస్తుంది
‘తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నటనకు ఆస్కారమున్న సినిమాలు చేసినప్పుడల్లా ఆదరిస్తారు’ అని అన్నారు తమిళ హీరో విక్రమ్. ఆయన నటించిన కొత్త సినిమా ‘కోబ్రా’. శ్రీనిధి శెట్టి నాయికగా నటిస్తున్నది. భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్. ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతున్నది.
తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. విక్రమ్ మాట్లాడుతూ…‘నా మనసుకు నచ్చిన కథ ఇది. చిత్రీకరణలో ఎక్కడా రాజీపడలేదు. రష్యాలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేశాం. ఒక్కో పాత్ర మేకప్‌కు ఐదు గంటల సమయం పట్టేది. తొమ్మిది విభిన్నమైన గెటప్పుల్లో నటించడాన్ని ఆస్వాదించాను. ప్రతి పాత్రకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఉంటాయి. హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించాం.యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని అందించే సినిమా అవుతుంది’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ..‘కమల్ హాసన్ తర్వాత నటుడిగా అంత విభిన్నమైన చిత్రాలు చేస్తారు విక్రమ్. ఇందులోనూ ఆ విలక్షణత చూస్తారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు అబ్బురపరుస్తాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

