Vikram Next Movie | చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది కోబ్రాతో మంచి శుభారంభం దక్కపోయినా.. ఇటీవలే విడుదలైన పొన్నియన్ సెల్వన్‌తో మంచి విజయం సాధించాడు. లేజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలైన భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈయన పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్61 చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమా 19 శతాబ్ధంలోని కోలార్ గోల్డ్ ఫీల్స్ నేపథ్యంలో తెరకెక్కతుందట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3డీలో రూపొందిస్తున్నారట. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరిపి.. మిగిలిన భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేస్తారట. ఈ సినిమాకు కేజీఎఫ్‌కు ఎలాంటి సంబంధం లేదని, కేజీఎఫ్ చిత్రం ఎక్కువగా గ్యాంగ్స్టర్స్ చుట్టూ తిరుగగా.. ఈ సినిమా 19శతాబ్దం నాటి కోలార్ గోల్డ్ ఫీల్డ్ ప్రజల జీవన విధానం, గనులు వంటి వాటి గురించి చూపించనున్నారట. జీవి ప్రకాష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కే. ఈ జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
Read Also:
అరుదైన అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్.. తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు
Rishab Shetty | రిషబ్ శెట్టికి తెలుగులో ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఎందుకో తెలుసా?
Sai Rajesh | ‘హృదయ కాలేయం’ దర్శకుడికి లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన మారుతి.. ధర ఎంతో తెలుసా?
Mohan Babu | ఆ మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీని మోహన్‌బాబు రీమేక్ చేస్తున్నాడా?