Jana Nayagan | జూలై 23నే ‘జననాయగన్’ విడుదల? హింట్ ఇచ్చిన మేనేజర్!
Jana Nayagan | తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ చివరి చిత్రంగా రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ డ్రామా 'జననాయగన్' విడుదలపై ఎట్టకేలకు ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.
Jana Nayagan | తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ చివరి చిత్రంగా రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ డ్రామా ‘జననాయగన్’ విడుదలపై ఎట్టకేలకు ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా జూలై 24న విడుదల కానుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే అంతకంటే ఒక రోజు ముందుగానే జూలై 23న థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చిత్ర సహ నిర్మాత, విజయ్ వ్యక్తిగత మేనేజర్ జగదీష్ పళనిసామి సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద హింట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదల తేదీపై ఆయన ఇచ్చిన హింట్‌తో దళపతి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, ఫైనల్ కట్లో కొన్ని కీలకమైన కొత్త సీన్లను యాడ్ చేయడం వల్ల ఈ సినిమా ఇటీవల మళ్లీ రీ-సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ జారీ చేసినప్పటికీ, సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. త్వరలోనే విడుదల కానున్న పవర్ఫుల్ ట్రైలర్ సినిమా అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

