తమిళ అగ్రహీరో దళపతి విజయ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తొకటి చెన్నై సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అధిగమించి విజయ్ అత్యధిక పారితోషికం అందుకోబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాకు 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
విజయ్ 68వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అట్లీ దర్శకుడు. ఈ సినిమా కోసం విజయ్ 150కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. గతంలో విజయ్-అట్లీ కాంబినేషన్లో తెరి, మెర్సల్, బిగిల్ వంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. విజయ్ కథానాయకుడిగా నటించిన ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.