The Goat | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటించిన చిత్రం ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా తెరకెక్కిన ఈ మూవీకి వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. గతేడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూళ్లు చేసింది.
డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ మంచి స్పందన రాబట్టుకున్న ఈ మూవీ ఇక టీవీల్లో కూడా సందడి చేసే టైం వచ్చేసింది. ఈ మూవీ నేడు సాయంత్రం 6:30 గంటలకు జీ తమిళ్లో ప్రీమియర్ కానుంది. అదేవిధంగా జనవరి 14న పొంగళ్ కానుకగా (మంగళవారం) ఉదయం 11 గంటలకు కూడా ప్రీమియర్ కానున్నట్టు ప్రకటించారు. ఇంతకీ ఈ తేదీ తెలుగు ప్రీమియర్‌కు సంబంధించినదేనా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కించగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
GOAT Pongal Treat Ready❤️🔥💥
The G.O.A.T | Today at 6.30 PM#GOATOnZeeTamil #TheGreatestOfAllTime #ZeeTamil @vp_offl pic.twitter.com/V8SxWUVvqR— Zee Tamil (@ZeeTamil) January 12, 2025
Game Changer | గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేకా?.. రిపోర్ట్స్ ఏం అంటున్నాయి అంటే.!
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి