Vijay Deverakonda | డియర్ రౌడీ ఫ్యాన్స్.. ఆ ఫొటో షేర్ చేయొద్దు ప్లీజ్..
చిత్ర పరిశ్రమలో లీకుల సమస్య ఈనాటిది కాదు. సినిమాలోని సీన్లకు సీన్లే లీకైన సందర్భాలున్నాయి. గత ఏడాది ‘గేమ్‌చేంజర్'లోని రామ్‌చరణ్ గెటప్ కూడా ఇలాగే లీకైంది. ఇప్పుడు దేవరకొండ విజయ్ సినిమా వంతు వచ్చింది.
Vijay Deverakonda | చిత్ర పరిశ్రమలో లీకుల సమస్య ఈనాటిది కాదు. సినిమాలోని సీన్లకు సీన్లే లీకైన సందర్భాలున్నాయి. గత ఏడాది ‘గేమ్‌చేంజర్’లోని రామ్‌చరణ్ గెటప్ కూడా ఇలాగే లీకైంది. ఇప్పుడు దేవరకొండ విజయ్ సినిమా వంతు వచ్చింది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నది. ఇందులో దేవరకొండ విజయ్ గూఢచారి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
తాజాగా ఈ సినిమాలోని ఆయన స్టిల్ సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైంది. ట్రిమ్ చేసుకొని వైట్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపిస్తున్నారు దేవరకొండ విజయ్. ఈ స్టిల్ ప్రస్తుతం ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. వెంటనే చిత్రయూనిట్ రంగలోకి దిగి, సోషల్ మీడియా నుంచి ఈ స్టిల్‌ని తొలగించే ప్రయత్నం చేసింది. కానీ అంతలోనే మరో స్టిల్ లీకైంది.
దీంతో సితార ఎంటర్టైన్మెంట్స్ స్పందిస్తూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘డియర్ రౌడీ ఫ్యాన్స్.. మీకు అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మా టీమ్ ఎంతో శ్రమిస్తున్నది. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుగుతున్నది. 60శాతం షూటింగ్ పూర్తయింది కూడా. త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల చేస్తాం. ఆ ఫొటో షేర్ చేయొద్దు ప్లీజ్..’ అంటూ సితార సంస్థ విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

