అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయా: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda | సినీనటి సమంతపై తన ఇష్టాన్ని బయటపెట్టారు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ. కాలేజీ రోజుల్లోనే ఆమెతో ప్రేమలో పడ్డానని తెలిపారు. సమంత టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘యశోద’. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను గురువారం విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. దీంతోపాటు సమంతపై తనకున్న ప్రేమను బయటపెట్టారు.
Vijay Deverakonda | సినీనటి సమంతపై తన ఇష్టాన్ని బయటపెట్టారు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ. కాలేజీ రోజుల్లోనే ఆమెతో ప్రేమలో పడ్డానని తెలిపారు. సమంత టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘యశోద’. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను గురువారం విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. దీంతోపాటు సమంతపై తనకున్న ప్రేమను బయటపెట్టారు.
‘‘నా కాలేజీ రోజుల్లో సమంతని మొట్టమొదటిసారి స్క్రీన్ మీద చూశాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయా. ఇప్పటికీ ఆమెను అన్ని విధాలా ఆరాధిస్తున్నా..’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు యశోద చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విజయ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘యశోద’ విషయానికొస్తే.. ఈ సినిమాకి హరి-హరీష దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఈ సినిమాలో సమంత డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన సరోగెట్ మదర్‌గా కనిపించనున్నారు. నవంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
ఇక, సమంత – విజయ్ దేవరకొండ మొదటిసారిగా ‘మహానటి’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ ఖుషీ (Kushi) చిత్రంలో నటిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Was in love with her, when as a college kid I saw her on the big screen for the first time. Today I admire and adore her for everything she is ❤️
So very happy to share with you all @Samanthaprabhu2's new film #YashodaTrailer ▶️ https://t.co/uT9gyBAj62
In theatres 11-11-2022 pic.twitter.com/KcYMnvj8sf
— Vijay Deverakonda (@TheDeverakonda) October 27, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

