విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా లైగర్ (Liger). టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తోంది. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ విజయ్ టీం అందించింది. జులై 21న లైగర్ ట్రైలర్ లాంఛ్ కాబోతుందని విజయ్ దేవరకొండ తెలియజేశాడు..3 రోజులు #LigerTrailer అంటూ ట్వీట్ చేశాడు.
జులై 21 ఉదయం 9:30 గంటలకు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో, అదే రోజు రాత్రి 7:30 గంటలకు ముంబై అంధేరీలోని సినీపొలిస్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించారు మేకర్స్. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే (Ananya Pandey) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన అక్డీ పక్డీ (Akdi Pakdi song)కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
లైగర్ చిత్రంలో రమ్యకృష్ణ కీ రోల్లో నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లైగర్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
In 3 Days.
“HAVOC”#LigerTrailer pic.twitter.com/axdWjEreQG
— Vijay Deverakonda (@TheDeverakonda) July 18, 2022