Vijay Devarakonda | రాయలసీమ యాసలో అదరగొట్టిన విజయ్ దేవరకొండ.. వీడియో
Vijay Deverakonda Rayalaseema Accent | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.
Vijay Deverakonda Rayalaseema Accent | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. శనివారం తిరుపతిలో ట్రైలర్ లాంఛ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. కొంచెం ఆలస్యం చేసిన రాత్రి 10 గంటల తర్వాత ట్రైలర్‌ను అయితే విడుదల చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ పాత విజయ్‌ని కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అంతకుముందు జరిగిన ఈ ట్రైలర్ లాంఛ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రాయలసీమ యాసలో అదరగొట్టాడు.
తిరుపతీ… ఎట్లా ఉండారు అందరూ?.. బాగుండారా?.. బాగుండాలి అందరం బాగుండాలి. ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము.. మీ అందరిని కలిసినాము. మీ అరుపులు కేకలు వింటుంటే చాలా సంతోషంగా ఉందబ్బా. మీ అందరికి ఒక మాట చెప్పాలే. ‘ఏడాది నుంచి ‘కింగ్డమ్’ గురించి ఆలోచిస్తుంటే ఒకటే అనిపిస్తాంది. మన తిరుపతి ఏడు కొండల వెంకన్న స్వామిగానీ.. ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. చాలా పెద్దొన్నై పూడుస్తా సామీ.. పోయి టాప్‌లో కూర్చుంటా. ఈ సినిమా కోసం అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఇక మిగిలింది వెంకన్నస్వామి దయ, మీ అందరి ఆశీస్సులు. ఈ రెండూ గనుక ఉంటే మనల్ని ఎవరూ ఆపేదేలే. అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

