చిత్రీకరణ తుది దశలో రణబాలి
19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక.
19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. తాజాగా ఈ సినిమా వందరోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
ఇటీవలే గండికోటలో వారంరోజులపాటు జరిగిన షెడ్యూల్లో విజయ్ దేవరకొండ, రష్మికలపై ఎమోషనల్ సీన్స్‌ని తీశారు. ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించిన 90శాతం షూటింగ్ పూర్తయింది. ఔట్పుట్ సంతృప్తికరంగా వచ్చిందని, విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌లోని యాక్షన్ సీక్వెన్స్ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాయని మేకర్స్ తెలిపారు. అర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

