Vijay Deverakonda | కేరళలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్..
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
Vijay Deverakonda | అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. కేరళ షెడ్యూల్లో యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్లో మాట్లాడారు. కేరళలోని ప్రకృతి అందాలు తనను మెస్మరైజ్ చేశాయని, ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, అభిమానులకు మంచి జ్ఞాపకాలను అందిస్తుందని చెప్పారు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్ ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘విధి పిలిచింది. రక్తపాతం ఎదురుచూస్తోంది’ అనే క్యాప్షన్‌తో గతంలో విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రస్తుతం అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని, పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, విజయ్ పాత్ర గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

