ఏప్రిల్‌లో ఫ్యామిలీ స్టార్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిస్తున్న 54వ చిత్రమిది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. ఫిబ్రవరి 20కల్లా చిత్రీకరణ ముగించుకొని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘దేవర’ కోసం మేకర్స్ ఈ డేట్ ఖరారు చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ‘దేవర’ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న రానున్నట్లు చిత్రసీమలో టాక్ నడుస్తోంది. ‘ఫ్యామిలీ స్టార్’లో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవకొండ కనిపించనున్నారు. కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: కేయూ మోహనన్, సంగీతం: గోపీ సుందర్, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

