Vidya Balan In NBK 112 | మళ్లీ బాలయ్యతో జతకట్టబోతున్న విద్యాబాలన్.. కొరటాల శివ సినిమాలో పవర్ఫుల్ రోల్!
Viday Balan | నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 112 గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
Viday Balan | నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 112 గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఒక కీలకమైన మరియు పవర్ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ (కథానాయకుడు, మహానాయకుడు) చిత్రాలలో బసవతారకం పాత్రలో బాలయ్య సరసన మెరిసిన విద్యాబాలన్, దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.
ఈ సినిమాలో మాఫియా నేపథ్యంలో సాగే ఒక హై-వోల్టేజ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని, అందులో బాలయ్య ‘ఊరమాస్’ అవతారంలో కనిపిస్తారని సమాచారం. ఆ ఎపిసోడ్లో ఆయనకు జోడీగా విద్యాబాలన్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని టాక్. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

