Vidya Balan | అందుకే నా పక్కన నటించడానికి వాళ్లు ఇష్టపడరు: విద్యాబాలన్
తాను మాత్రమే చేయగలిగిన పాత్రలను ఎంచుకొని మరీ నటించే గొప్ప నటి విద్యాబాలన్. తనుంటే హీరోతో పనిలేదు. సినిమా మొత్తాన్ని భుజంపై మోసేంత కెపాసిటీ ఉన్న హీరోయిన్ తను. సినీ పరిశ్రమపై ఆమెకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి.
Vidya Balan | తాను మాత్రమే చేయగలిగిన పాత్రలను ఎంచుకొని మరీ నటించే గొప్ప నటి విద్యాబాలన్. తనుంటే హీరోతో పనిలేదు. సినిమా మొత్తాన్ని భుజంపై మోసేంత కెపాసిటీ ఉన్న హీరోయిన్ తను. సినీ పరిశ్రమపై ఆమెకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. వాటిని సందర్భం వచ్చినప్పుడు కుండ బద్దలుకొట్టి మరీ చెప్పడం విద్యాబాలన్ స్పెషాలిటీ. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై ఆసక్తికరంగా మాట్లాడారు విద్యాబాలన్. ‘ బాలీవుడ్లో బంధుప్రీతి ఎక్కువ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. నేనైతే దాన్ని ఒప్పుకోను. అదే ఉంటే హీరోల పిల్లలందరూ సక్సెస్ అయ్యేవారుకదా!? ఇక్కడ టాలెంట్ ముఖ్యం.
ఉదాహరణకు నన్నే తీసుకోండి. నాకెలాంటి సినీ నేపథ్యం లేదు. కిందస్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను. అందుకే ప్రేక్షకులు నన్ను చూసే దృక్కోణం భిన్నంగా ఉంటుంది. అదే నా వెనుక ఏదైనా స్టార్ ఫ్యామిలీ ఉంటే, నన్ను మరోలా చూసేవారేమో. ఇప్పుడున్న నా స్థాయి, అవకాశాలు.. ఇవన్నీ నా నటన చూసే వచ్చాయి.’ అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఇంకా మాట్లాడుతూ ‘నేను ్రస్త్రీ ప్రాధాన్యతా చిత్రాల్లో ఎక్కువ నటిస్తుంటాను. వాటిని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తుంటారు. కొందరు హీరోలకు అది నచ్చదు. అందుకే నా పక్కన నటించడానికి వాళ్లు ఇష్టపడరు. దానికి నేనేం బాధపడను. ఇది కూడా ఓ విధంగా గౌరవంగానే భావిస్తా’ అంటూ అందంగా నవ్వేశారు విద్యాబాలన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

