స్వరలహరి.. బప్పిలహిరి
ఆధునిక సంగీతంతో వెండితెరను ఊపేసిన స్వర సవ్వడి ఆగిపోయింది. రివ్వున శ్రోతల చెవిని సోకే ఆ పాటల జడి ఇక వినిపించనంది. విలక్షణ గీతాలకు దశాబ్దాల చిరునామా చెరిగిపోయింది. డిస్కోను సినిమా పాటకు జతగా చేసిన స్వరలహరి బప్పిలహిరి
ఆధునిక సంగీతంతో వెండితెరను ఊపేసిన స్వర సవ్వడి ఆగిపోయింది. రివ్వున శ్రోతల చెవిని సోకే ఆ పాటల జడి ఇక వినిపించనంది. విలక్షణ గీతాలకు దశాబ్దాల చిరునామా చెరిగిపోయింది. డిస్కోను సినిమా పాటకు జతగా చేసిన స్వరలహరి బప్పిలహిరి తన పాటతో మరో లోకాన్ని మైమరపించేందుకు వెళ్లిపోయారు.
సంగీత సామ్రాజ్యం వీడిన డిస్కో కింగ్
డిస్కో కింగ్ గా ప్రసిద్ధుడైన సంగీత దర్శకుడు బప్పిలహిరి (69) కన్నుమూశాడనే వార్త భారతీయ చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న బప్పిలహిరి మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు కొడుకు బప్పాలహిరి, కూతురు రీమాలహిరి ఉన్నారు. ఇద్దరూ సంగీత రంగంలో ఉన్నారు. బప్పిలహిరి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
బెంగాలీ సినిమాల నుంచి బాలీవుడ్
అపరేష్ లహిరి, బన్సూరి లహిరి దంపతులకు 1952, నవంబర్ 27న బెంగాల్ లోని జల్పాయ్గురిలో జన్మించారు బప్పిలహిరి. ఆయన అసలు పేరు అలోకేష్ లహిరి. సంగీతకారుల కుటుంబంలో పుట్టిన బప్పిలహిరికి పాటలపై ప్రేమ బాల్యం నుంచే మొదలైంది. చిన్నతనంలో తబలా వాయిద్యాన్ని నేర్చుకున్నారు. తనతో పాటే సంగీతంపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. స్వరకల్పనపై ప్రేమ సినీరంగం వైపు తీసుకొచ్చింది. బెంగాళీ, హిందీ చిత్రాలకు సంగీతదర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. డిస్కోలో కొత్త తరహాలను కలిపి ఆధునిక సినిమా పాటను ఆకట్టుకునేలా స్వరపరిచారు. మన స్వరాలతో వెస్ట్రన్ కలిసిన సరికొత్త చమత్కారంతో పాటలు రూపకల్పన చేశారు. ఈ ప్రత్యేకతతో అచిరకాలంలోనే బప్పిలహిరికి సంగీత దర్శకుడిగా గుర్తింపు దక్కింది. ‘అమర్ ప్రేమ్’, ‘మందిర’, ‘బద్నామ్’, ‘అమర్ తుమీ’, ‘ఆశా ఓ బాలోబషా’ లాంటి బెంగాళీ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో ‘డిస్కో డాన్సర్’, ‘నమక్ హలాల్’, ‘డాన్స్ డాన్స్’, ‘నయా కదమ్’ లాంటి సినిమాలు బప్పిలహిరికి కమర్షియల్ సక్సెస్ ఇచ్చాయి. బీట్ అయినా, మెలొడీ అయినా బప్పి పాటలన్నీ సంగీత ప్రియులను పరవశించేలా చేశాయి. రాగంతో మధురంగా పాట ప్రారంభించి పల్లవికి కొత్త మలుపు తీసుకోవడం పాటపై బప్పి..పెట్టే సంతకం.
టాలీవుడ్‌తో ప్రత్యేక అనుబంధం
తెలుగు చిత్ర పరిశ్రమతో బప్పిలహిరికి ప్రత్యేక అనుబంధం ఉంది. హీరో కృష్ణ నటించిన ‘సింహాసనం’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారాయన. ఈ చిత్రంలో ‘వహవా నీ యవ్వనం, వహవా నీ జవ్వనం’, ‘ఆకాశంలో ఒక తార ..’ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో బప్పిలహిరి క్రేజ్ తెలుగు హీరోలనూ ఆకట్టుకుంది. చిరంజీవి నటించిన ‘స్టేట్ రౌడీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘బిగ్ బాస్’ చిత్రాలతో పాటు బాలకృష్ణ ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘నిప్పు రవ్వ’ సినిమాలకు ఈ స్వరకర్త గుర్తుండిపోయే పాటలు కూర్చారు. తను కంపోజ్ చేసిన చిత్రాలన్నింటినీ మ్యూజికల్ హిట్స్ చేశారు బప్పిలహిరి. చాలామంది ప్రేక్షకులకు బప్పిలహిరి తెలియకున్నా, ఆయన పాట మాత్రం సుపరిచితం. రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ చిత్రంలో రమ్ పమ్.. అనే పాటను పాడారు బప్పిలహిరి. ఆయన పనిచేసిన చివరి తెలుగు సినిమా ఇదే. సినీసంగీత స్వరప్రయాణంలో ఎంతోమంది సంగీత దర్శకులు రావొచ్చు..కానీ బప్పిలహిరి స్థానం భర్తీచేయలేనిది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

