Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Vatsala Rajagopal | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (92) వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (92) వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తొలుత రంగస్థల కళాకారిణిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వత్సలా రాజగోపాల్, నాటకరంగంలో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత తన 60 ఏళ్ల వయసులో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం ‘రోజా’ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా తమిళ, తెలుగు భాషల్లో కలిపి దాదాపు 400లకు పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.
కేవలం సినిమాలే కాకుండా అనేక టెలివిజన్ సీరియల్స్‌లోనూ నటించి ఆమె బుల్లితెర ప్రేక్షకులకు కూడా అత్యంత చేరువయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్లో ఎన్టీఆర్ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘అదుర్స్’ చిత్రంలో ఆమె నటన ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బామ్మగా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తెరపై బామ్మ పాత్రలైనా, ఇతర సహాయ పాత్రలైనా తన సహజమైన నటనతో జీవించిన వత్సలా రాజగోపాల్ మరణం పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
PM Modi | దేశం కష్టాల్లో ఉంటే విపక్షాలకు సంతోషం.. ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

