Venky Atluri | సూపర్ 30కి ముందు సార్ కథ రాసుకున్నా : వెంకీ అట్లూరి
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన సార్ (Sir) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సార్ మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రాఫిట్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా చూసిన వారిలో కొంతమంది హిందీ సినిమాలు సూపర్ 30, 3 ఇడియట్స్ కు పోలికలున్నాయని అభిప్రాయపడుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా సార్ (Sir). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కగా.. తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో విడుదలైంది. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సార్ మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రాఫిట్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ సినిమా చూసిన వారిలో కొంతమంది హిందీ సినిమాలు సూపర్ 30, 3 ఇడియట్స్ కు పోలికలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్స్ పై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు వెంకీ అట్లూరి. తాను 1990లో చదువుకున్నానని, తన సొంత అనుభవాల నుంచి ఈ కథను రెడీ చేసుకున్నానని చెప్పాడు. అయితే సూపర్ 30 విడుదలైనపుడు తన కథకు దగ్గరగా ఉంటుందని కొంచెం భయపడ్డానని, సినిమా చూశాక సూపర్ 30కి తాను రాసుకున్న స్క్రిప్ట్‌కి ఎలాంటి సారుప్యతలు లేవని తెలుసుకున్న తర్వాత రిలాక్స్ అయ్యానని చెప్పుకొచ్చాడు.
ఈ కథలో ధనుష్ అయితేనే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటుండే వాడినని చెప్పుకొచ్చాడు వెంకీ అట్లూరి. తన స్క్రిప్ట్ విన్న తర్వాత ఎప్పుడు డేట్స్ కావాలంటే అప్పుడు ఇస్తానని ధనుష్ తనతో చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. ధనుష్ నమ్మినట్టుగా సార్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు వెంకీ అట్లూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

