‘ఎఫ్-3’ ‘నారప్ప’ ‘దృశ్యం-2’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం ఆయన రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ఆయన తదుపరి సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తాజా సమాచారం ప్రకారం ‘హిట్’ ‘హిట్-2’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కమల్‌హాసన్ ‘విక్రమ్’ తరహాలో ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. వెంకటేష్ నటించనున్న 75వ చిత్రమిది కావడంతో ఈ సినిమాపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, సుదీర్ఘ విరామం తర్వాత యాక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం.