Venkatesh | సంక్రాంతికి వస్తున్నాం.. ఇంటిల్లిపాదీ కలిసి చూసే సినిమా: వెంకటేశ్
“నిజామాబాద్‌లో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూసేలా సంక్రాంతి సినిమా ఉండాలి. అలాగే ఈ సినిమా ఉంటుంది. అనిల్ చక్కగా తీశాడు. మా సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్, గేమ్‌చేంజర్ కూడా పెద్ద హిట్లు అవ్వాలి.”
Venkatesh | “నిజామాబాద్‌లో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూసేలా సంక్రాంతి సినిమా ఉండాలి. అలాగే ఈ సినిమా ఉంటుంది. అనిల్ చక్కగా తీశాడు. మా సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్, గేమ్‌చేంజర్ కూడా పెద్ద హిట్లు అవ్వాలి.” అని వెంకటేశ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.
ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ట్రైలర్‌ని మించి సినిమా ఉంటుంది. ఇదొక టిపికల్ జానర్.
ప్రియురాలికీ, భార్యకీ మధ్య నలిగిపోయే అద్భుతమైన పాత్ర వెంకీ చేశారు. ఆయన కెరీర్లో చాలా గొప్ప పాత్రలు చేశారు. వాటిలో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఐశ్వర్య, మీనాక్షి కూడా అద్భుతంగా నటించారు. దిల్‌రాజుగారి బ్యానర్లో నేను చేసిన 5వ సినిమా ఇది. ఇన్ని అవకాశాలిచ్చిన రాజుగారికి థ్యాంక్స్.
అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది.’ అని నమ్మకంగా చెప్పారు. ఇంకా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, కథానాయికలు ఐశ్వర్యరాజేష్, మీనాక్షి చౌదరి, నరేష్లతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణగుప్త కూడా మాట్లాడారు. చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

