Venkatesh | టాలీవుడ్లో తన కామిక్ స్టైలిష్ యాక్టింగ్‌తో అదరగొట్టే యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు వెంకటేశ్ (Venkatesh). ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్2, ఎఫ్ 3 సినిమాల్లో నటించాడని తెలిసిందే. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచాయి. ఇక వెంకటేశ్ రీసెంట్ మూవీ సైంధవ్ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద పూర్ టాక్ తెచ్చుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే వెంకీ కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు వెంకీ. ఈ ప్రాజెక్ట్ ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించబోతున్నాడు. కాగా లాంఛింగ్ సెర్మనీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కామిక్ స్టైల్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. కామిక్ స్టైల్‌తో అలరించే అనిల్ రావిపూడి-వెంకటేశ్ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో మరికొన్ని రోజులు ఆగితే తెలిసే అవకాశమున్నట్టు టాలీవుడ్ సమాచారం.