VasudevaSutham | తమిళ యాక్టర్, దేవి ఫేం చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ వసుదేవసుతం (Vasudheva Sutham). వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టుగా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వసుదేవ సుతం దేవమ్ సాంగ్ లాంచ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ఏమైపోతుందో ఇంకేం కానుందో లిరికల్ వీడియో సాంగ్‌ను ఆస్కార్ అవార్డు విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ లాంచ్ చేశారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా.. పవన్ చరణ్ బోనిలా, శృతిక సముద్రాల పాడారు. హీరోహీరోయిన్ల ట్రాక్‌తో సాగుతున్న ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేయనుందని విజువల్స్, లిరిక్స్ చెప్పకనే చెబుతున్నాయి.
వసుదేవసుతం మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. దైవిక అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది. మాస్టర్ మహేంద్రన్ త్రిశూలాన్ని పట్టుకున్న విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితమైన నిధి సాహసం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Oscar Awardee @boselyricist garu launches the soulful #Emayipothundho from #VasudevaSutham ✨https://t.co/Zw5ODBdPQD…
A magical #ManiSharma musical.
Audio out on @JungleeMusicSTH @TimesMusicHub@Actor_Mahendran#Ambikavani #RainBowCinemas#MimeGopi #VykuntBonu #JohnVijay… pic.twitter.com/iJjMTU51BD
— BA Raju’s Team (@baraju_SuperHit) November 16, 2025
Akhanda 2 | నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. 3డీ ఫార్మాట్లో ‘అఖండ 2’
Rajkummar Rao | తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ దంపతులు
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!