Vishwambara | ‘విశ్వంభర’ లేట్‌గా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయం.. డైరెక్టర్ వశిష్ఠ సంచలన కామెంట్స్
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ విజువల్ వండర్స్‌లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది.
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ విజువల్ వండర్స్‌లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా చిరంజీవి బర్త్‌డే వేడుకల్లో దర్శకుడు వశిష్ఠ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశ్వంభర సినిమా విడుదల ఆలస్యమవుతున్న విషయంపై స్పందించిన వశిష్ఠ.. ఆలస్యం అవుతున్నప్పటికీ విజువల్స్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదని స్పష్టం చేశారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా వశిష్ఠ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. “విశ్వంభర లేట్‌గా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది.. రాసిపెట్టుకోండి” అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడి నమ్మకం, సినిమాపై ఆయన చూపుతున్న కాన్ఫిడెన్స్ చూసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడుదల ఆలస్యమైనా, ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ థియేటర్లలో సునామీ సృష్టించడం ఖాయమంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఉండటం సహజం. ఈసారి కూడా ‘విశ్వంభర’ నుంచి కొత్త పోస్టర్, గ్లింప్స్ లేదా ఇతర సర్ప్రైజ్ వస్తుందని అభిమానులు ఆశించారు. ముఖ్యంగా సినిమా విడుదల ఆలస్యమవుతున్న నేపథ్యంలో చిత్రబృందం నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
అయితే దర్శకుడు వశిష్ఠ తాజా వ్యాఖ్యలతో, ప్రస్తుతానికి సినిమా నుంచి పెద్ద అప్డేట్ ఉండకపోవచ్చనే చర్చ మొదలైంది. కానీ సినిమా క్వాలిటీ విషయంలో టీమ్ తీసుకుంటున్న జాగ్రత్తలే ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ‘విశ్వంభర’ చిత్రాన్ని కేవలం ఒక సాధారణ సోషియో ఫాంటసీగా కాకుండా, ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేలా రూపొందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలనే లక్ష్యంతో చిత్రబృందం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఆలస్యమైనా సరే.. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే నిర్ణయంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు మరికొంత కాలం ఎదురుచూడాల్సి వచ్చినా, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం ఆ నిరీక్షణకు తగ్గట్టుగానే ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

