గెలవడం తప్ప ఆప్షన్ లేదు!
‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన కథ ఇది. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ కేవలం హీరోగా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా కొంత బాధ్యత తీసుకున్నాడు. యువబృందం చేసిన ఈ కొత్త ప్రయత్నం
‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన కథ ఇది. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ కేవలం హీరోగా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా కొంత బాధ్యత తీసుకున్నాడు. యువబృందం చేసిన ఈ కొత్త ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు అల్లు అరవింద్. ఆయన సమర్పణలో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. సిద్ధూ ముద్ద, అల్లు బాబీ నిర్మాతలు. ఏప్రిల్ 8న విడుదలకానుంది. గురువారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. బాక్సింగ్‌లో నేషనల్ ఛాంపియన్‌గా ఎదగాలనే యువకుడి పోరాటం నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
‘నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది’ వంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం యూఎస్‌లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేశా. సన్నివేశాల్లో సహజత్వం కనిపించాలని పూర్తిగా శిక్షణ తీసుకున్నాకే షూటింగ్ మొదలుపెట్టాం. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నదియా, జగపతిబాబు వంటి సీనియర్ నటీనటులు ఈ సినిమాకు బలంగా నిలిచారు’ అని అన్నారు. ‘ఈ సినిమాలో వరుణ్‌తేజ్ రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనిపిస్తారు. పోరాటఘట్టాలు కొత్త అనుభూతిని పంచుతాయి’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: అల్లు బాబీ కంపెనీ, రినైశాన్స్ పిక్చర్స్, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

