Operation Valentine | ఈ వాలెంటైన్ దేశాన్ని ప్రేమిస్తాడు
Operation Valentine | ‘2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు వీరమరణం పొందారు. దానికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 14న ఆపరేషన్ నిర్వహించింది.
Operation Valentine | ‘2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు వీరమరణం పొందారు. దానికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 14న ఆపరేషన్ నిర్వహించింది. దాన్నే మనం సర్జికల్ ైస్టెక్ అంటాం. వాలెంటైన్డే రోజు జరిగింది కనుక శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌గా ఈ సర్జికల్ స్ట్రైక్‌ని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో తీసిన సినిమా ఇది’ అన్నారు వరుణ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తిప్రతాప్‌సింగ్ హడా దర్శకుడు. సందీప్ ముద్దా నిర్మాత. మార్చి 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్ విలేకరులతో ముచ్చటించారు.
- ఈ కథ రీత్యా వాలెంటైన్ అంటే దేశప్రేమికుడు. ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. ‘పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాలో ది బెస్’్ట అని ప్రశంసించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్‌గా కనెక్టయ్యే సినిమా ఇది.
- దర్శకుడు శక్తిప్రతాప్‌సింగ్ పాషన్ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకోసం చాలా రీసెర్చ్ చేశాడు. ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో అంతకుముందు తను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. వారిదగ్గరనుంచి మరింత సమాచారాన్ని తీసుకొని ఇష్టంతో ప్రాణం పెట్టి ఈ కథ తయారు చేశాడు. ఈ కథ వినగానే కాసేపు షాక్‌లో ఉండిపోయాను.
- నేను సోనీ పిక్చర్స్‌కి ఓ సినిమా చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. అందుకే ఆలస్యం చేయకుండా సోనీ పిక్చర్స్ వారికి ఈ కథ పంపాం. వాళ్లు కూడా వార్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ అప్పీల్ ఉన్న కంటెంట్ కావడంతో గ్రాండ్ బడ్జెట్‌తో పక్కాగా ప్లాన్ చేసి ఈ సినిమా చేశారు. సోనీ వాళ్లు ఓకే చెప్పగానే హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సన్నివేశం తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం.
- ఫ్లైట్ డ్రైవింగ్ విషయంలో చాలా మెళకువలు నేర్చుకున్నాను. ఫ్లయిట్ నడుపుతున్నప్పుడు టెక్నికల్‌గా మన కదలికలు ఏ విధంగా ఉంటాయో పైలట్లను అడిగి తెలుసుకున్నాను. ఫ్లయిట్ నడుపుతున్నప్పుడు ముఖం అంతా ఆక్సిజన్ మాస్క్‌తో కప్పి ఉంటుంది. ఎమోషన్స్ అన్నీ కళ్లతోనే పలికించాలి. దానికోసం చాలా కష్టపడ్డాను. వీఎఫ్ఎక్స్పై దర్శకుడు శక్తికి చాలా పట్టు ఉంది. అలాగే, నటీనటుల నుంచి నటన కూడా బాగా రాబట్టుకున్నాడు.
- మిస్వరల్డ్గా దేశానికి పేరు తెచ్చిన మానుషి చిల్లర్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రాడార్ ఆఫీసర్‌గా తను అద్భుతంగా నటించింది. మిక్కీ.జే.మేకర్ బ్రిలియంట్ కంపోజర్. ఇందులోని పాటలు, నేపథ్య సంగీతం మనుసులకు హత్తుకునేలా ఉంటాయి.
- నా సినిమాల విషయంలో బాబాయ్ పవన్‌కల్యాణ్ పెద్దగా స్పందించరు. నచ్చితే ‘గుడ్’ అని సరిపెట్టేస్తారు. కానీ ఈ సినిమా టీజర్ చూసి, ఫోన్ చేసి మాట్లాడారు. ‘నీ సినిమా టీజర్ అయిదారుసార్లు చూశాను. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా చాలా బాగా కనినిస్తున్నావ్. చాలా బావుంది. సినిమా ఎప్పుడు చూపిస్తున్నావ్?’ అనడిగారు. చాలా సంతోషం అనిపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

