Gandeevadhari Arjuna | స్టైలిష్ యాక్షన్ పార్టుతో వరుణ్‌తేజ్ గాండీవధారి అర్జున టీజర్
Gandeevadhari Arjuna | మెగా హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గాండీవధారి అర్జున. ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య (Sakshi Vaidya)ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను టీజర్ రూపంలో అందించారు మేకర్స్.
Gandeevadhari Arjuna | మెగా హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గాండీవధారి అర్జున. ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య (Sakshi Vaidya)ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. VT 12 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ విడుదల చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోవైపు ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను టీజర్ రూపంలో అందించారు మేకర్స్.
టీజర్లో వచ్చే స్టైలిష్ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్ సినిమాకు హైలెట్‌గా నిలువబోతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ది ఘోస్ట్ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. గాండీవధారి అర్జున మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గాండీవధారి అర్జున ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
వరుణ్ తేజ్ మరోవైపు VT13లో కూడా నటిస్తున్నాడు. వార్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
గాండీవధారి అర్జున టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

