వరుణ్ సందేశ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘యద్భావం తద్భవతి’. రమేష్ జక్కల దర్శకుడు. ఇనయ సుల్తానా కథానాయిక. ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాత. గురువారం వరుణ్ సందేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో సందీప్‌కిషన్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న మాస్ చిత్రమిది. వరుణ్ సందేశ్ కెరీర్‌కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది’ అన్నారు.