Varasudu Movie | వారసుడు మూవీ క్రేజీ అప్డేట్..!
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ‘తుపాకి’ సినిమాతో ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుండి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.
Varasudu Movie | తమిళ హీరో విజయ్ ప్రస్తుతం తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ‘తుపాకి’ సినిమాతో ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుండి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ తెలుగులో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తెలుగు దర్శకుడితో చేతులు కలిపాడు. ‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఓ పాట కోసం శింబును సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలోని ఓ పెప్పీ సాంగ్‌ను శింబుతో పాడిపించనున్నారట. ఇప్పటికే థమన్ ట్యూన్‌ను కూడా సిద్ధం చేసినట్లు టాక్. ఇక ఇటీవలే శింబు ది వారియర్లో బుల్లెట్ సాంగ్ పాడిన విషయం తెలిసిందే. ఈ పాటకు ప్రేక్షకుల నుండి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు వారసుడిలో శింబుతో సాంగ్‌ను పాడించాలని చిత్రబృందం అనుకుంటుందట. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. విజయ్‌కు జోడీగా రష్మిక నటిస్తుంది.
Read Also:
Taapsee Pannu | బిగ్ స్క్రీన్కు దూరమవుతున్న తాప్సీ.. ఇక ఓటీటీలకే పరిమితం అవుతుందా?
జపాన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ సరికొత్త రికార్డు..!
ఆ క్రేజీ కాంబినేషన్ కోసం నాలుగు బడా నిర్మాణ సంస్థల పోటీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

