జపాన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ సరికొత్త రికార్డు..!
RRR Movie | జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న రిలీజైన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. ‘బాహుబలి-2’ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.
RRR Movie | జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న రిలీజైన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. ‘బాహుబలి-2’ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా రిలీజైన ప్రతి భాషలోనూ డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ సినిమాతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది.
ఇక ఇటీవలే ఈ చిత్రం జపాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్‌కు వారం రోజుల ముందు నుండి ఆర్ఆర్ఆర్ బృందం ప్రమోషన్లు పెద్ద ఎత్తున జరపడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి వారంలోనే 75M Yen(రూ.4 కోట్లను) కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా తాజాగా ఈ సినిమా బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా ఆర్ఆర్ఆర్ 304M YEN (రూ.17 కోట్లకు పైగా కలెక్షన్లు) సాధించి జపాన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాకుండా జపాన్‌లో ఈ చిత్రాన్ని 2లక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. ఇక మరో రూ.9 కోట్లు సాధిస్తే ముత్తు రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడున్న ఆర్ఆర్ఆర్ స్పీడ్ చూస్తుంటే మరో వారం పది రోజుల్లో ముత్తు రికార్డు కూడా బ్రేక్ కావడం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఇండియాలో రూ.1200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

