Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Varanasi | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన దృశ్యాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.
Varanasi | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన దృశ్యాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను అత్యంత ఆశ్చర్యపరిచే ఘట్టం రామాయణానికి సంబంధించినదేనని తాజాగా చర్చ జరుగుతోంది. ఇతిహాసాన్ని వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించాలనే లక్ష్యంతో రాజమౌళి ఈ భాగాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రాజమౌళి.. రామాయణం వంటి గొప్ప ఇతిహాసాలను సినిమాల్లో చూపించే విధానం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
గతంలో వచ్చిన ఎన్నో పౌరాణిక చిత్రాలు తనకు నచ్చినప్పటికీ, రామాయణం వంటి గొప్ప గ్రంథాలకు తెరపై పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందని తాను భావించలేదని ఆయన పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి. ఇతిహాసాలను రచించిన విధానానికి, వాటిని వెండితెరపై ఆవిష్కరించే తీరుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఈ అంశం తనను ఎన్నో ఏళ్లుగా ఆలోచింపజేసిందని, అందుకే దాన్ని ఒక సవాల్‌గా తీసుకున్నానని వివరించారు. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? ఆ కథను ఎలా చూపించబోతున్నావు? అని తనను తాను ప్రశ్నించుకున్నానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ ఆలోచనే ‘వారణాసి’లో రామాయణ ఘట్టాన్ని రూపొందించడానికి ప్రధాన ప్రేరణగా నిలిచిందని తెలుస్తోంది.
‘వారణాసి’లో రామాయణానికి సంబంధించిన ఓ కీలక ఘట్టాన్ని చూపించే అవకాశం తనకు లభించిందని రాజమౌళి పేర్కొన్నట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ సన్నివేశంలో భారీ యుద్ధాలు, అద్భుతమైన దృశ్యాలతో పాటు పాత్రల మధ్య ఉండే లోతైన భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, దాని రూపకల్పనలో మాత్రం రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు అరగంట పాటు ఉండే ఈ ఘట్టం కోసం దాదాపు 60 రోజుల షూటింగ్ నిర్వహించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలను చిత్రబృందం అధికారికంగా ధ్రువీకరించలేదు. ‘వారణాసి’లో రామాయణ ఘట్టానికి సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా జరుగుతోంది. రాముడు, హనుమంతుడు, వానర సైన్యానికి ఒకవైపు.. కుంభకర్ణుడికి మరోవైపు మధ్య జరిగే భీకర యుద్ధాన్ని సినిమాలో చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ యుద్ధం ఎలా ఉండబోతోంది? రామాయణంలోని ఏ ఘట్టాన్ని రాజమౌళి ఎంచుకున్నారు? కాల ప్రయాణం నేపథ్యంలో సాగే కథలో ఈ ఇతిహాస భాగాన్ని ఎలా అనుసంధానించనున్నారు? వంటి ప్రశ్నలకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

