టాలీవుడ్ (Tollywood) హీరో పవన్ కల్యాణ్ తో వకీల్‌సాబ్ (Vakeel Saab) చిత్రాన్ని నిర్మించారు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor). దిల్ రాజుతో కలిసి బోనీకపూర్ తెరకెక్కించిన వకీల్ సాబ్ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సీనియర్ నిర్మాత ఇండియన్ ఫుట్ బాల్ టీం కోచ్ స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా మైదాన్ (Maidaan).
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ (Ajay Devgan) కీలక పాత్రలో నటిస్తున్నాడు. బ్లాక్ బాస్టర్ సినిమా బఢాయ్ హో ఫేం అమిత్ రవీందర్ నాథ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భారత ఫుట్ బాల్ క్రీడ చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణించే 1952-62 ల మధ్య కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అమిత్. ఈ సినిమా విడుదల తేదీని బోనీకపూర్ ప్రకటించారు. 2022 జూన్ 3న హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మైదాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.
అజయ్ దేవ్ గన్ నటించిన భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇటీవలే విడుదలైంది. ఈ స్టార్ హీరో చేతిలో ఆర్ఆర్ఆర్, సూర్యవంశి, గంగూభాయ్ కథియావాడి, మేడే, థాంక్ గాడ్, దృశ్యం 2 చిత్రాలున్నాయి.
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
ఉత్తేజ్ భార్య సంతాప సభలో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన