సినీరంగంలో ఎదగాలంటే గుమ్మడికాయంత విద్వత్తుంటే చాలదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు.. మన ‘బేబీ’ ఫేం వైష్ణవికి అవగింజంతేం ఖర్మ.. అదృష్టం అనపకాయంతుంది. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే అమ్మాయి, ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోవడమేంటి?!. నిజానిక్కూడా ‘బేబీ’ సినిమాలో ఈ అమ్మాయి నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడనే చెప్పాలి. ఒక చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’ ఇప్పటికి 90కోట్ల పై చిలుకు వసూళ్లను రాబట్టింది. ఈ కారణంగానే ప్రస్తుతం వైష్ణవి ఇంటికి నిర్మాతలు క్యూ కడుతున్నారు..
సినీ వర్గాల సమాచారం ప్రకారం హీరోయిన్గా ఈ అమ్మాయి లైనప్ మామూలుగా లేదని తెలుస్తున్నది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే ఈ అమ్మాయి డేట్స్ కోసం పోటీపడుతున్నారట. ప్రస్తుతానికైతే గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఓ చిత్రానికి కథానాయికగా వైష్ణవి ఎంపికైనట్టు తెలిసింది. అలాగే త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలోనూ వైష్ణవి ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.