అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మాన్యూల్ కథానాయిక. రాకేశ్ శశి దర్శకుడు.అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘మాయారే’ అంటూ కొనసాగే లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు, పాటకు చక్కని స్పందన వస్తున్నది. సినిమా కూడా నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెచ్చే విధంగా వుంటుంది. నవంబరు 4న చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.