Bro Movie Special Song | నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని వినోదయ సిత్తం రీమేక్‌పై ఇప్పుడు ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. మూడు రోజుల క్రితం విడుదలైన మోషన్ పోస్టర్‌తో తిరుగులేని హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్‌లుక్ పోస్టరే ఈ రేంజ్లో దింపితే సినిమా ఇంకా ఏ లెవల్లో ఉంటుందన్న ఊహే పవన్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని, దాని కోసం కాస్ట్ లీ పబ్ సెట్ ను కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక ఈ పాట కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతులాను చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. పవన్ , సాయిధరమ్ తేజ్ లతో కలిసి ఊర్వశి చిందులు వేయనున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇంత కాస్ట్ లీ పబ్ ను ఇప్పటివరకు నిర్మించలేరని ఇన్ సైడ్ టక్. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది.