Urfi Javed | సోషల్ మీడియాలో పొద్దస్తమానం ఉండేవాళ్లకు ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్టాలో తనకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని.. గ్లామర్ ఒలకబోసే ఉర్ఫీకి సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ ఉంది. బిగ్బాస్ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఉర్ఫీ.. కొన్ని రోజుల్లోనే సెలబ్రిటీ అయిపోయింది. వెరైటీ డ్రెస్సులు వేయడం.. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఇన్స్టాలో ఫోటోలు, వీడియో పెట్టి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఉర్ఫీ.
తాజాగా మరో విచిత్రమైన డ్రెస్సు వేసుకొని అందరినీ విస్మయానికి గురి చేసింది. నెటిజన్లు అయితే ఆ వీడియో చూసి కళ్లు మూసుకుంటున్నారు. మరీ ఇంతలా రెచ్చిపోవడమా. అడ్డూ అదుపు లేకుండా ఇలా బరితెగించడం ఏంటి అంటూ నెటిజన్లు ఉర్ఫీని ప్రశ్నిస్తున్నారు. ఒంటి మీద ఎటువంటి డ్రెస్ వేసుకోకుండా కేవలం తన ఫోటోలను డ్రెస్లా సెట్ చేసుకొని ఉర్ఫీ డ్యాన్స్ చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.