Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
Upasana | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఆసుపత్రుల వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల తనదైన శైలిలో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారాలు, సేవా కార్యక్రమాలు, అంతర్జాతీయ సమావేశాలు, మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆమె.. కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తుంటారు.
Upasana | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఆసుపత్రుల వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల తనదైన శైలిలో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారాలు, సేవా కార్యక్రమాలు, అంతర్జాతీయ సమావేశాలు, మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆమె.. కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా యాంకర్ సుమ నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఫర్ జాయిస్’ సంస్థ ఐదో వార్షికోత్సవ కార్యక్రమానికి ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ గురించి మాట్లాడిన ఉపాసన.. ఆ తర్వాత మహిళల మధ్య ఉండాల్సిన ఐక్యత, పరస్పర సహకారం గురించి ప్రస్తావించారు.
తన పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయం గుర్తించినట్లు చెబుతూ, కొంతమంది మహిళలు తమ విజయాన్ని సాధించడానికి ఇతర మహిళలను వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ విజయాల కోసం ఇతర మహిళలకు అన్యాయం చేయడం సరైన పద్ధతి కాదని ఉపాసన స్పష్టం చేశారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి లేదా బలహీనమైన పురుషుడిని మెప్పించడానికి మరో మహిళను తొక్కేయాలని ప్రయత్నించకూడదని సూచించారు. కొంతమంది తమ ఎదుగుదల కోసం ఇతర మహిళల అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక మహిళకు బాధ కలిగించి, ఆమెను వెనక్కి నెట్టి మరొక మహిళ విజయం సాధించడం సరైనది కాదని ఉపాసన పేర్కొన్నారు. మహిళలు ఒకరికొకరు పోటీదారులుగా కాకుండా, పరస్పరం తోడ్పడే వ్యక్తులుగా ఉండాలని ఆమె సందేశమిచ్చారు.
మహిళల మధ్య పరస్పర గౌరవం, సహకారం పెరగాల్సిన అవసరం ఉందని ఉపాసన అభిప్రాయపడ్డారు. ఇతరుల విజయాన్ని అడ్డుకోవడం కంటే, ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగాలని సూచించారు. మహిళల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, అందరూ కలిసి ఎదుగుతూ ఐక్యంగా ఉండాలని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం వంటి అంశాలపై ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఆమె వ్యాఖ్యలు ఎవరినైనా ఉద్దేశించి చేసినవవా అనే దానిపై క్లారిటీ లేదు కాని, ఆమె చెప్పిన సందేశం మాత్రం మహిళలు ఒకరికొకరు అండగా నిలుస్తూ విజయాలను పంచుకోవాలనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక విడాకులు తీసుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..!
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

