Unstoppable l ఆద్యంతం నవ్వుల విందు
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘అన్‌స్టాపబుల్'. ‘అన్ లిమిటెడ్ ఫన్' ఉపశీర్షిక. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఏ2బి ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై రజిత్ రావు నిర్మిస్తున్నారు.
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘అన్‌స్టాపబుల్’. ‘అన్ లిమిటెడ్ ఫన్’ ఉపశీర్షిక. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఏ2బి ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై రజిత్ రావు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సంపూర్ణ హాస్యభరిత చిత్రమిది. కుటుంబమంతా చూసి ఆనందించేలా ఉంటుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేశారు’ అన్నారు.
‘సినిమాల మీద అభిరుచితో ఇండస్ట్రీకి వచ్చాను. నా తొలి చిత్రానికి ప్రేక్షకుల దీవెనలు కావాలని కోరుకుంటున్నా. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని నిర్మాత రజిత్ రావు తెలిపారు. బిత్తిరి సత్తి, షకలక శంకర్, పృథ్వీ, డీజే మురళి, రాజా రవీంద్ర, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీౠధర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం: కాసర్ల శ్యామ్, ఎడిటర్: ఉద్ధవ్, నిర్మాత: రజిత్ రావు, రచన-దర్శకత్వం: డైమండ్ రత్నబాబు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

