ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమాకు 20 ఏళ్లు.. సాధించిన రికార్డులు ఇవే..

Uday kiran manasantha nuvve | కొన్ని సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోతాయి. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాటిని మరిచిపోవడం సాధ్యం కాదు. అలాంటి ఒక అద్భుతమైన సినిమా మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్ , రీమా సేన్ జంటగా వి.ఎన్.ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001 అక్టోబర్ 19న విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కేవలం కోటి 30 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన మనసంతా నువ్వే.. 16 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాత ఎం.ఎస్.రాజు కు లాభాల పంట పండించింది. ఈ సినిమాకు ముందు దేవి పుత్రుడు సినిమాతో నిర్మాత ఎమ్మెస్ రాజుకు కష్టాలు వచ్చాయి. దాంతో భారీ సినిమాలు కాకుండా ఒక చిన్న సినిమా చేయాలి అనే ఆలోచనతో మనసంతా నువ్వేకు బీజం వేశాడు ఈయన.
1954లో వచ్చిన ఒక సినిమా చూస్తున్నప్పుడు అందులో హీరో హీరోయిన్లు విడిపోయి మళ్లీ కలుసుకోవడానికి పడే తపన ఎం.ఎస్.రాజు కు బాగా నచ్చింది. ఆ ఆలోచన వెంటనే పరుచూరి బ్రదర్స్ కు చెప్పి కథ సిద్ధం చేయాలని కోరాడు. అనుకున్నట్లుగానే మనసంతా నువ్వే కథ సిద్ధమైపోయింది. హీరోగా ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్న తరుణంలో అప్పుడే నువ్వు నేను విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ కుర్రాడు అయితే బాగుంటాడు అని పరుచూరి బ్రదర్స్ చెప్పడంతో ఎం.ఎస్.రాజు కూడా వెంటనే ఓకే అన్నాడు. కానీ ఈ సినిమా కోసం మహేశ్ బాబు అయితే బాగుండు అని ఎం.ఎస్.రాజు అనుకున్నాడు.. కానీ అది కుదరలేదు. ఉదయ్ కిరణ్ వచ్చిన తర్వాత ఈ సినిమాకు మరింత బలం వచ్చినట్లయింది. జూన్ 1, 2001 న రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు.. కేవలం నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి అక్టోబర్ 19న విడుదల చేశారు.
మనసంతా నువ్వే సినిమా పూర్తయిన తర్వాత చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఎమ్మెస్ రాజు ఇంటి ముందు క్యూ కట్టారు. కానీ ఆయన సినిమాపై నమ్మకంతో సొంతంగా విడుదల చేసుకున్నాడు. విడుదలైన మొదటి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది మనసంతా నువ్వే . కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. ఏకధాటిగా 200 రోజులు ఆడింది సినిమా. అప్పట్లో చాలామంది పెద్ద పెద్ద హీరోలు సాధించలేని ఎన్నో రికార్డులు కేవలం మూడో సినిమాతో అందుకున్నాడు ఉదయ్ కిరణ్. అప్పటికే చిత్రం, నువ్వు నేను సూపర్ డూపర్ హిట్ కావడంతో మనసంతా నువ్వే ఆయనకు హ్యాట్రిక్ విజయం అందించింది. ఈ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన కలుసుకోవాలని, శ్రీరామ్, నీ స్నేహం లాంటి సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న మనసంతా నువ్వేని తలుచుకుంటూ.. ఉదయ్ కిరణ్ ను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
21 ఏళ్ళ ‘చిత్రం’.. అప్పట్లో ఉదయ్ కిరణ్-తేజ సంచలనం
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Vishnu: మా ఇద్దరి మధ్య గొడవలు లేవు అని వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

