Turkey | ట్రెండింగ్‌లో బాయ్ కాట్ టర్కీ.. ఆ దేశం కోసం మన డబ్బులు ఖర్చు పెట్టొద్దన్న నిఖిల్
Turkey | జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడడం మనం చూశాం. 9 ప్రాంతాల్లోని టెర్రర్ క్యాంప్‌పై మెరుపుదాడులకు దిగిన ఇండియన్ ఆర్మీ వాటిని పూర్తిగా నేలమట్టం చేసింది.
Turkey | జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడడం మనం చూశాం. 9 ప్రాంతాల్లోని టెర్రర్ క్యాంప్‌పై మెరుపుదాడులకు దిగిన ఇండియన్ ఆర్మీ వాటిని పూర్తిగా నేలమట్టం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సైతం భారత్‌లోని ఎయిర్‌బేస్‌లు, మిలటరీ స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే మన సైన్యం వాటిని గాల్లోనే పేల్చేసింది. ఈ పరిణామాలతో భారత్ – పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందేమోనని అంతా భయపడ్డారు. కాని ప్రస్తుతానికి బ్రేక్ పడింది.
అయితే భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో టర్కీ(తుర్కియో) పాక్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాయ్ కాట్ టర్కీ అనే క్యాంపెయిన్ కూడా రన్ అవుతోంది కొంతమంది పండ్ల వ్యాపారులు టర్కీ యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడం మానేశారు. మరోవైపు టర్కీలో భారతీయ సినీ నిర్మాతలు షూటింగ్స్ పెట్టుకోవద్దని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అన్ని భారతీయ చిత్ర నిర్మాతలను కోరింది. దీంతో సినిమా షూటింగ్స్ అక్కడ జరగని పక్షంలో ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.
ఇక పలువురు ప్రముఖులు కూడా టర్కీపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నిఖిల్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో టర్కీ దేశ అధ్యక్షుడి వీడియోను పోస్ట్ చేయగా, అందులో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాట్లాడుతూ.. ఏదేమైనా మేం పాకిస్థాన్ నే సపోర్ట్ చేస్తాం. ఆ దేశంతోనే కలిసి ముందుకు వెళ్తాం అంటూ ప్రకటించాడు. ఆ నెటిజన్ పోస్ట్ ను రీ ట్వీట్ చేసిన నిఖిల్.. ‘ఇప్పుడు చెప్పండి ఆ టర్కీ దేశం వెళ్తారా. మన వాళ్లు చాలా మంది ఆ దేశం వెళ్లి అక్కడ భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాంటి దేశం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ దేశం వస్తువులు కూడా మనం వాడొద్దు’ అంటూ రాసుకొచ్చాడు నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ ట్వీట్‌ని కూడా కొందరు వైరల్ చేస్తున్నారు.
Anyone still visiting Turkey ? Please read this Below Thread…
Indians Spend Billions of Dollars Every year in Turkey.
Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

