Sai Dharam Tej | ఆ పదం తొలగించండి.. సాయిధరమ్ తేజ్ సినిమాకు టీఎస్ న్యాబ్ నోటీసులు
TSNAB | మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా పేరుపై వివాదం నెలకొన్నది. గాంజా శంకర్ (Gaanja Shankar) టైటిల్‌పై నార్కొటిక్ బ్యూరో (TSNAB) ఆగ్రహం వ్యక్తంచేసింది.
TSNAB | మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా పేరుపై వివాదం నెలకొన్నది. గాంజా శంకర్ (Gaanja Shankar) టైటిల్‌పై నార్కొటిక్ బ్యూరో (TSNAB) ఆగ్రహం వ్యక్తంచేసింది. సినిమా పేరులో గంజాయి పదం తొలగించాలని సూచించింది. సినిమా పేరు మార్చాల్సిందేనంటూ చిత్ర యూనిట్‌కు టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మూవీ ట్రైలర్ కూడా యువతపై ప్రభావం చూపేలా ఉన్నదని, దానిని కూడా మార్చాలని ఆదేశించారు. సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతకరమైన దృశ్యాలుంటే ఎన్డీపీఎస్-1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నది. సినిమాల్లో గంజాయి, డ్రగ్స్‌ని ప్రోత్సహించే సన్నివేశాలు ఉంటే తొలగించాలని తెలిపారు. సినిమాల్లో గంజాయి, డ్రగ్స్‌ని ఎట్టిపరిస్థితుల్లో చూపెట్టవద్దని ఆదేశించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

