‘మార్టిన్ లూథర్ కింగ్’.. ఇందులో కింగ్ ఎవరనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రంగా పూజా కొల్లూరు తెరకెక్కించారు. డైరెక్టర్‌గా తనకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నుంచి వెంకటేశ్ మహా తెలుసు. తను మంచి దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా అని రుజువు చేసే చిత్రమిది. ఎంతో నమ్మకం ఉంటేగానీ ముందుగానే ప్రేక్షకులకు చూపించి సినిమాను విడుదల చేయరు.
వరంగల్ ప్రీమియర్‌లో జనంమధ్య ఈ సినిమా చూశాను. ఆద్యంతం విపరీతంగా ఎంజాయ్ చేశారు’ అన్నారు సీనియర్ నటుడు నరేష్. ఆయన ప్రత్యేక పాత్రలో సంపూర్ణేశ్‌బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. ఈ నెల 27న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడారు. ‘ఈ పొలిటికల్ సీజన్లో రావాల్సిన సినిమా ఇది. ఇందులో ఎవర్నీ విమర్శించలేదు. రాజకీయాల వల్ల జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని కామెడీగా చెప్పడం జరిగింది అంతే. ఇందులో వారసత్వంగా వస్తున్న గ్రామసర్పంచ్ పదవికోసం తపించే వ్యక్తిగా కనిపిసా.్త’ అని చెప్పారు నరేశ్.