Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. చాలా కాలంగా షూటింగ్లో ఉన్న ఈ సినిమా చివరి దశకు చేరుకోగా, సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘పెద్ది పెహల్వాన్’ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. 44 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్‌లో చరణ్‌ను కుస్తీ యోధుడిగా చూపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కండలు తిరిగిన లుక్, మైదానంలో కుస్తీ పట్టు సన్నివేశాలు, చివర్లో గదతో చేసిన విన్యాసాలు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో ఈ గ్లింప్స్‌పై కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పహిల్వాన్ మరియు సుల్తాన్ సినిమాలను పోలి ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. కుస్తీ నేపథ్యంలోని కొన్ని షాట్లు ‘పహిల్వాన్’ టీజర్‌ను గుర్తు చేస్తున్నాయని, అందుకే ఇది కాపీ లేదా ఫ్రీమేక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆరోపణలకు మెగా అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. కుస్తీ అనే ఆట ఎక్కడైనా ఇసుకలోనే ఆడతారని, అందువల్ల కొన్ని విజువల్స్ ఒకేలా కనిపించడం సహజమని చెబుతున్నారు. చిన్న గ్లింప్స్ ఆధారంగా సినిమా కథను అంచనా వేయడం సరికాదని, పూర్తి సినిమా వచ్చిన తర్వాతే పోలికలు చెప్పాలని సూచిస్తున్నారు.
నిజానికి ‘పెద్ది’ సినిమా కేవలం కుస్తీ నేపథ్యంలో మాత్రమే కాకుండా మల్టీ స్పోర్ట్స్ జానర్లో రూపొందుతోందని సమాచారం. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలు కూడా కీలకంగా ఉంటాయని టాక్. ఇప్పటికే విడుదలైన ఇతర ప్రమోషనల్ కంటెంట్‌లో రామ్ చరణ్ క్రికెటర్‌గా కనిపించగా, ఇప్పుడు కుస్తీ యోధుడిగా కొత్త కోణంలో దర్శనమిచ్చారు. కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదు.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట” అనే పవర్ఫుల్ డైలాగ్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. అలాగే “చూడుమే.. ఆటే నా పొగరు” అంటూ చరణ్ చెప్పే డైలాగ్ అభిమానుల్లో మరింత హైప్‌ను పెంచుతోంది.ఇప్పటి వరకు ఒకే లుక్‌లో కనిపించిన చరణ్‌ను, ఈసారి పెహల్వాన్ అవతార్‌లో చూడటం అభిమానులకు కొత్త అనుభూతినిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఇలాంటి గెటప్‌లో కనిపించడం అరుదు కావడంతో ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగాయి.